శ్రీ గౌతం క్రియేషన్స్ పతాకంపై గణగళ్ల మానస సమర్పణలో జి.లక్ష్మణరావు నిర్మిస్తోన్న చిత్రం `డిసెంబర్ 31` `వర్మగారి బంగ్లా` ట్యాగ్ లైన్. జి. కొండలరావు దర్శకత్వం వహిస్తోన్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా హైదారాబాద్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ...``మోషన్ పోస్టర్ చాలా క్రియేటివ్ గా ఉంది. స్టోరి లైన్ విన్నాను. సస్పెన్స్ తో కూడిన కామెడీ థ్రిల్లర్ . ముఖ్యంగా సినిమాకు ఏసిపి రవీంద్ర పాత్ర పవర్ ఫుల్ గానే కాకుండా సినిమాకే హైలెట్ గా నిలవనుంది . సినిమా సక్స్ స్ సాధించాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు`` అన్నారు. దర్శకుడు జి.కొండలరావు మాట్లాడుతూ...``ఈ సినిమా అరకు, వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. కథ విషయానికొస్తే...ప్రతి డిసెంబర్ 31 కు ఎంతో మంది అమ్మాయిలు పార్టీ పేరుతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హత్యలు చేయబడుతున్నారు. అసలు ఇది ఎలా జరుగుతుంది? దీన్ని ఏ విధంగా ఆవపవచ్చు. అసలు చేస్తుంది ఎవరు? దానిని గుర్తించడం కోసం స్పెషల్ ఆఫీసర్ , ఎన్‌కౌంటర్ స్పెషలిష్ట్ ఏసిపి రవీంద్ర రంగంలోకి దిగి అసలు హంతకులను ఎలా పట్టుకున్నారు అన్నది చిత్ర కథాంశం. మా సినిమా మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన వినాయక్ గారికి నా ధన్యవాదాలు`` అన్నారు.
ఈ చిత్రంలో జి.కొండలరావు, నవకాంత్, షకలక శంకర్, పోసాని, గౌతం రాజ్, నరేష్ , గిరీష్, హర్ష, శ్రావణి, మధురెడ్డి, అమీషా తదితరులు నటించారు.
సహనిర్మాతః అంబటి రాఘవేంద్రరెడ్డి; రాయితి రమణమూర్తి; జి.అప్పారావు; సంగీతంః బోలె; పాటలుః కందికొండ; కెమెరాః వెంకట్; ప్రొడక్షన్ డిజైనర్ః పాట శ్రీను; పీఆర్వోః వంగాల కుమారస్వామి; కథ-స్క్రీన్ ప్లే -దర్శకత్వంః జి.కొండలరావు; నిర్మాతః జి.లక్ష్మణరావు,